హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సి సక్సెస్ లు రాకున్నా అదృష్టం కొద్ది చాలా తెలుగులో చిత్రాల్లోనటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో మెల్ల మెల్లగా ఫేడ్ అవుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్లింది. బాలీవుడ్ లో అడపా దడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. స్టార్స్ సినిమాలో నటిస్తున్న కారణంగా తాప్సికి అక్కడ మంచి గుర్తింపే దక్కింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా కూడా సౌత్ సినిమాలను మాత్రం వదలను అంటోంది. తనకు సినీ కెరీర్ ను ప్రసాదించిన సౌత్ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ముఖ్యమే అని బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా సౌత్ లో మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె 'గేమ్ ఓవర్' అనే ద్వి భాష చిత్రంలో నటించింది. వీల్ చైర్ కు పరిమితం అయిన పాత్రలో తాప్సి కనిపించనున్నట్లుగా ఫస్ట్ లుక్ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని సౌత్ లో సినిమాను చేయడంను తాను ఆస్వాదిస్తానంటూ తాప్సి పేర్కొంది. సౌత్ సినిమాలను వదిలి పెట్టకుండా సంవత్సరంకు కనీసం ఒక్కటి అయినా చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.