జవాన్ల కుటుంబాల కోసం విజయ్ దేవరకొండ సాయం

16 Feb,2019

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సాయం చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో వుంటాడు. అందులో భాగంగా ఇటీవల కేరళ లో వరదబాధితులకు అలాగే థీట్లీ తూపాన్ బాధితులకు తన వంతు సాయం చేశాడు. తాజాగా మరోసారి తన మానవత్వాని చాటుకున్నాడు విజయ్.  జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో భారత సైన్యం ఫై జరిగిన ఉగ్రదాడి లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ‘భారత్ కే వీర్’ పథకం కింద ఆర్థిక సాయం చేశాడు విజయ్ దేవరకొండ. జవాన్లు మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలని విజయ్ ట్వీట్ చేసి భారత్ కే వీర్ నిధికి విరాళం ఇచ్చిన సర్టిఫికెట్ ను పోస్ట్ చేశాడు. అయితే తను ఎంత మొత్తం విరాళం ఇచ్చాడో విజయ్ తెలియనివ్వలేదు.

Recent News