హీరో హీరోయిన్ టీజర్ విడుదల 

15 Feb,2019

స్వాతి పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అడ్డా`. జి.య‌స్‌.కార్తిక్ ద‌ర్శ‌కుడు. న‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి సురేష్‌, పూజా జ‌వేరి కీల‌క పాత్ర‌ధారులు. `ఎ పైరేటెడ్ ల‌వ్ స్టోరీ` అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో  విడుద‌ల చేశారు. సీనియ‌ర్ ఫొటోగ్రాఫ‌ర్ జ‌నార్ద‌న్‌, వీడియోగ్రాఫ‌ర్ పొన్నం శ్రీనివాస్ సంయుక్తంగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ముఖ్య అతిథి బి.ఎ.రాజు మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు కార్తిక్ మా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేశారు. `అడ్డా` వంటి హిట్ సినిమా చేశారు. టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ అత‌ను. నవీన్ చంద్ర‌కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది. పైర‌సీని అరిక‌ట్టాల‌ని చాలా మంది చాలా ర కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్‌గా ఉంటుంది. ల‌వ్‌స్టోరీ కూడా ఉంది. మంచి హిట్ కావాలి అన్నారు.
ద‌ర్శ‌కుడు కార్తిక్ మాట్లాడుతూ ``అడ్డా త‌ర్వాత గ్యాప్‌లో తీసిన సినిమా ఇది. పైర‌సీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఇందులో న‌వీన్ పాత్ర కాస్త నెగ‌టివ్ షేడ్స్ లో ఉంటుంది. ఇండ‌స్ట్రీలో జ‌రిగే త‌ప్పుల్ని ఎత్తి చూపించే కుర్రాడిగా న‌వీన్ న‌టిస్తారు. నిర్మాత కూతురుగా హీరోయిన్ క‌నిపిస్తుంది. పూజా జ‌వేరి గ్లామ‌ర్ పాత్ర‌లోచేసింది. ఇండ‌స్ట్రీలోని హీరోల‌కు, నిర్మాత‌ల‌కు త్వ‌ర‌లోనే ఓ షో వేస్తాం. నిర్మాత నాకు మంచి స్నేహితుడు. మా షో చూడ‌టానికి త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి విశాల్ కూడా వ‌స్తున్నారు`` అని అన్నారు.
న‌వీన్ చంద్ర మాట్లాడుతూ ``త‌మ సినిమాలు పైర‌సీ అవుతాయ‌ని తెలిసినా కేర్ చేయ‌కుండా సినిమాలు తీసే నిర్మాత‌లుకు హ్యాట్సాఫ్‌. క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న సినిమా ఇది. ఇండ‌స్ట్రీలో ఉన్న అంద‌రు హీరోల అభిమానులు క‌లిస్తే పైర‌సీని త‌రిమేయ‌గ‌ల‌రు. నా తొలి సినిమా `అందాల రాక్ష‌సి` పైర‌సీ కాపీని చూసిన‌ప్పుడు నాకు చాలా బాధ‌గా అనిపించింది`` అని అన్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ ``తెలుగులో న‌టించాల‌నే నా క‌ల నెర‌వేరింది. ప‌వ‌ర్‌ఫుల్ సినిమా ఇది. రొమాంటిక్ అంశాలు కూడా ఉన్నాయి`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``పైర‌సీ అనేది ప్ర‌స్తుతం బ‌ర్నింగ్ ఇష్యూ. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. డిఫ‌రెంట్ సినిమా అవుతుంది. మార్చిలో విడుద‌ల చేస్తాం. ఒక్క పాట మిగిలి ఉంది. గోవాలో చిత్రీక‌రిస్తాం`` అని అన్నారు.


 

Recent News