జెర్సీ ఫోకస్ కోలీవుడ్ పై పడిందా

15 Feb,2019

హీరో నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమాకు సంబంధించిన మొదటి పాటను ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా విడుదల చేయనున్నారట. తమిళంలో ఈ చిత్రంను విడుదల చేసేందుకు నిర్మాతలు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తమిళంలో పాటను విడుదల చేయడంతో అర్థం అవుతుంది.
నాని గతంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు. కాని ఎక్కువ సార్లు నానికి అక్కడ నిరాశే మిగిలింది. అయితే ఈసారి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అవ్వడంతో తమిళ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆధరిస్తారనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు తమిళంలో కూడా జెర్సీని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం  టీజర్ తో సినిమాపై ఆసక్తి పెరిగింది. 

Recent News