ప్రేమలో లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడం ఒక్కటే బాలన్స్. ఇప్పటిదాకా బయటికి అధికారికంగా చెప్పకపోయినా ఫోటోలు చేష్టల ద్వారా తమ బంధాన్ని ప్రపంచానికి ఎప్పుడో చాటి చెప్పిన ఈ లవర్స్ మూడు మూళ్ళకు మాత్రం ఇంకా చాలా టైం ఉందని అంటున్నారు. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట రచ్చ చేసింది . అందులో కొన్ని జ్ఞాపకాలను విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు.