భారీ బడ్జెట్ సినిమాలో కర్ణుడిగా విక్రమ్

13 Feb,2019

 తమిళ్ తో పాటు దేశవ్యాప్తంగా ముఖ్య భాషలు అన్నింటిలో రాబోతున్న మహావీర్ కర్ణ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చియాన్ విక్రమ్ మొదటిసారి మహాభారత గాధలోని కర్ణుడి వేషం వేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందుతోందని  టాక్ . యునైటెడ్ ఫిలిం కింగ్ డం నిర్మిస్తున్న ఈ మూవీ కోసం వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ ఘట్టాలను షూట్ చేస్తున్నాడు దర్శకుడు ఆర్ ఎస్ విమల్. మొత్తం 18 రోజుల పాటు భీకరమైన ఈ యుద్ధ సన్నివేశాలని తీయబోతున్నారు. విక్రమ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త రూపంలో  చూడబోతున్నారని యూనిట్ చెబుతోంది.  
 

Recent News