70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై శశిదేవరెడ్డి, విజయ్ చిల్లా నిర్మాతలుగా మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రం యాత్ర. జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితగాథ ఆధారంగా, ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలిచిన ప్రజా సంకల్ప యాత్రని ముఖ్య కథాంశంగా తీసుకొని దర్శకుడు యాత్ర చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా 970 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమాను వైఎస్ ఆర్ అభిమానులే కాకుండా సాధరణగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. యాత్ర చిత్రాన్ని వైఎస్ సతీమణి శ్రీ వైఎస్ విజయమ్మ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ లాబ్ ప్రివ్యూ థియేటర్ లో వీక్షింక్షారు. ఆనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో
శ్రీ వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ జననేత, మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపైన ప్రజా సంకల్ప యాత్రకు దర్శకుడు మహి ఈ యాత్ర సినిమాతో చక్కగా తెరరూపం ఇచ్చారని ప్రశంశించారు. రాజకీయాలకు అతీతంగా ఎవ్వరూ మనసు నొప్పించకుండా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులతో పాటు సాధరణ ప్రేక్షకులకి నచ్చే రీతిన దర్శకుడు మహి ఈ సినిమా తెరకెక్కించడం తనకు నచ్చిందని, రాజశేఖర్ రెడ్డిగారి గుండే తోతుల్లో స్మరించించుకుంటున్న అనేక మంది అభిమానలు ఈ చిత్రాన్ని ఆదరించడం చాలా ఆనందాన్నిస్తుందని, రానున్న రోజుల్లో మరింత ఆదరణ ఈ చిత్రానికి దక్కాలని అన్నారు. అలానే అనేకనేక వ్యయప్రయాసలను కూర్చి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవరెడ్డి సమర్పకుడు శివ మేకను ప్రత్యేకంగా అభినందనలను తెలిపారు. అశ్రిత మాట్లాడుతూ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా అశ్రిత తెలిపారు. ఈ సినిమాలో తాను వైఎస్ విజయమ్మ గారి పాత్ర పోషించా అని, చిత్ర విడుదలైన దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి తన నటనకి ప్రశంసలు లభిస్తున్నాయని. అంతా తనని విజయమ్మగారి మాదిరిగానే ఉన్నా అని చెప్పడం తనకు చాలా ఆనందాన్నిస్తుందని, ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవరెడ్డి సమర్పకుడు శివ మేక, దర్శకుడు మహి వి రాఘవకు కృత్ఞతలు తెలిపారు.