షార్ప్ షూటర్స్ గా తాప్సి

11 Feb,2019

సొట్టబుగ్గల సుందరి తాప్సీ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  కెరీర్ ఆరంభంలో మసాలా సినిమాలు ఎక్కువగా చేసినప్పటికీ ఇప్పడు మాత్రం రూట్ మార్చింది.  వీలైనంతవరకూ డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలలో నటిస్తోంది. తాజాగా తాప్సీ తన కొత్త సినిమా ప్రకటించింది. 'సాంద్ కి ఆంఖ్' అనే పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు చంద్రో తోమర్(87) .. ప్రకాశి తోమర్(82) అనే వయసుమళ్ళిన షార్ప్ షూటర్ల జీవితం ఆధారం.  చంద్రో.. ప్రకాశి ఇద్దరూ తోడికోడళ్ళు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్ లోని జోహ్రీ గ్రామానికి చెందినవారు. ఇద్దరూ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఉమన్ షార్ప్  షూటర్లు. వారిద్దరూ తమకు యాభై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు షూటింగ్ క్రీడలో ఎంటర్ అయ్యారట. తాప్సీ పన్ను..భూమి పెడ్నేకర్ లు వీరి పాత్రలలోనే నటిస్తున్నారు. భూమి..చంద్రో.. ప్రకాశిలతో కలిసి తీయించుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన తాప్సి "ప్రపంచంలో ఓల్డెస్ట్ అండ్ కూలెస్ట్ షూటర్లు చంద్రో..ప్రకాశి ల సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నాం." అంటూ ట్వీట్ చేసింది.  అనురాగ్ కశ్యప్.. నిధి పర్మార్.. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తారు.

Recent News