సైలెన్స్ అంటూ బయపెట్టనున్న అనుష్క

11 Feb,2019

సౌత్ లో అనుష్క అగ్రస్థాయి కథానాయికగా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య తగ్గించినా, అభిమానులు మాత్రం ఆమె స్థానాన్ని పదిలంగానే ఉంచారు. 'భాగమతి' సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న అనుష్క, నాయికా ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగనుంది. కోన వెంకట్ సమర్పిస్తోన్న ఈ సినిమాలో మాధవన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగు కోసం విదేశాల్లోని కొన్ని లొకేషన్స్ ను ఎంపిక చేశారట. కొన్ని లొకేషన్స్ లో మైనస్ డిగ్రీల చలి వుంటుందట. అంత చలిలో సైతం షూటింగులో పాల్గొనడానికి అనుష్క అంగీకరించిందని సమాచారం. తెలుగు. తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి, 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Recent News