దివంగత నేత, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ముక్యంగా ఆయన చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యాత్ర. 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ , శశి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ .. యాత్ర శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. విడుదలైన మొదటి ఆటతోనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో అనూహ్యమైన రెస్పాన్స్ రావడం .. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ రావడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో మా దర్శకుడూ మహి పెట్టిన ఎఫర్ట్ సక్సెస్ అయింది. నిజానికి ఈ సినిమా విషయంలో మహితో పొలిటికల్ సినిమా అవసరమా .. ఎందుకు కాంట్రవర్సీ అవుతుందని అన్నాను .. కానీ తాను చెప్పిన ఒక లైన్ విని బాగా నచ్చడంతో ప్రొసీడ్ అయ్యాం. ఈ సినిమాలో మమ్ముట్టి గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పలేం. నిజంగా అయన వై ఎస్ పాత్రలో జీవించేసాడు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ .. అభిమానానికి హద్దులు ఉంటాయని నేను నమ్మను .. నిజంగా వై ఎస్ జీవిత కథతో సినిమా తీయాలని .. ముక్యంగా అయన చేసిన యాత్ర నేపథ్యంలో ఈ సినిమా తీసాం. నిజంగా రాజన్న గా తెలుగు ప్రజల గుండెల్లో అయన స్తానం ఏమిటో చూసాకా ఈ సినిమా చేయొద్దనిపించింది. ఎందుకంటే వాళ్ళ అభిమానాన్ని నేను వెలకట్టలేను. ఈ సినిమా విషయంలో అందరు స్టార్స్ ల ఫాన్స్ తమ హీరో సినిమాగా భావించి ఎంతగానో సపోర్ట్ చేసారు. యాత్ర సినిమా చూసి కేవలం రాయలసీమ నుండే స్పందన వస్తుందని అనుకున్నా కానీ తెలంగాణ, ఆంధ్రా , ఓవర్ సీస్ నుండి ఎన్నో ఫాన్స్ వస్తున్నాయి. మళ్ళి మా రాజన్నను చూపించావయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు అన్నారు.