పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదా శర్మ పలు చిత్రాల్లో నటించినా కమర్షియల్ గా పెద్దగా కాలేదు దాంతో ఇప్పుడు ఐటెం సాంగ్స్ కోసం రెడీ అయింది. వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న నాని తన తర్వాత సినిమా జెర్సి షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా క్రికెట్ నేపధ్యంలో సాగనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అదా శర్మ ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పిందట. సన్ ఆఫ్ సత్య మూర్తి సినిమాలో మంచి పాత్ర కూడా చేసింది. అయితే వరుసగా తెలుగు తమిళ్ హింది బాషలో ఏదో ఒక సినిమా ఆఫర్స్ వస్తూ ఉన్నప్పటికీ -లీడ్ హీరోయిన్ గా ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. ఆ క్రమంలోనే హీరోయిన్ పాత్రలు చేస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్స్ కి కూడా రెడీ అనేసిందని టాక్. టాలీవుడ్ కధనం ప్రకారం...ఈ భామ నానీతో కలసి జెర్సి'లో ఐటమ్ సాంగ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట !! మొత్తంగా చూసుకుంటే సినిమా హీరోయిన్ గా కంటే ఈ ఐటమ్ పాటలకే డిమ్యాండ్ ఎక్కువగా ఉండడంతో మన అందాల తారలు ఆ అవకాశాలను ఎక్కడా మిస్ చేసుకోవడం లేదు.