నాగకన్య ఫస్ట్ లుక్ వచ్చేసింది

09 Feb,2019

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ విభిన్నమైన లుక్ తో విడుదల చేసిన ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్ గా విడుదల చేశాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. అని అన్నారు. 

Recent News