విజయ్ ని మైకేల్ గా మార్చేసిన అట్లీ

09 Feb,2019

తమిళ ఇళయ దళపతి విజయ్ 63 వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నా విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మురుగదాస్ దర్శకత్వంలో  'సర్కార్' సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆ తరువాత చేసే సినిమా ఆ స్థాయిదై ఉండాలనే ఉద్దేశంతో, దర్శకుడు అట్లీ కుమార్ కి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. గతంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేసిన 'తెరి' .. 'మెర్సల్' చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నా నేపథ్యంలో వీరిద్దరి కాంబినషన్ లో ఓ భారీ సినిమా సెట్ అయింది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.   ఈ సినిమాలో 'మైఖేల్' అనే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి 'మైఖేల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు, దాదాపు దీనినే ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Recent News