అకట్టుకుంటున్న అక్కడొకడుంటాడు ...హీరో శివ కంఠంనేని.
శివ కంఠంనేని టైటిల్ పాత్రలో రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞదీపిక హీరోహీరోయిన్లుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం అక్కడొకడుంటాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లో. పాత్రికేయులతో ముచ్చటించారు టైటిల్ పాత్రధారి శివ కంఠంనేని. ఆ విశేశాలు ఆయన మాటల్లో... ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అండ్ రివ్యూస్ రేటింగ్ చాలాాబాగా రావడం మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు బావున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నామౌత్ టాక్ తో టీలరోజు రోజుకు కలెక్షన్లు బాగా పెరిగాయి. మొదటి వారం విజయవంతంగా పూర్తయింది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. కొత్తదనానికి పట్టంకడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చిత్రం చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ ను కలిగిస్తోంది. సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చుండ పెడుతోంది. ఈ సినిమాలో నా పాత్ర అందుడిగా ఉన్న కూడా అద్భుతంగా చేశావని ఆడియన్స్ ప్రశంశించడం మరచిపోలేని అనుభూతి. ఇకపై నటుడిగా భిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. నేను 1992..95 వరకు సినిమా రాంగంలో ఉన్నాను.అప్పట్లో పలు టివి సీరియల్స్ చేసాను 15 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. దేవదాస్ కనకాల దగ్గర నటనలో ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించి ఆ తరువాత బిజినెస్ రంగంలో బిజీ అవ్వడంతో మధ్యలో సినిమాలు చెయ్యలేదు...కానీ ఇకపై నటుడిగా కొనసాగాలని ప్లాన్ చేస్తాన్నాను..నా తదుపరి చిత్రంగా కథలు వింటున్నాను.. త్వరలోనే దానిగురించి తెలియచేస్తా అంటూ ముగించారు.