వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, నిన్నటితో 25 రోజులను పూర్తి చేసుకుంది. ఆల్రెడీ 100 కోట్లకి పైగా గ్రాస్ ను .. 75 కోట్లకి పైగా షేర్ ను ఈ సినిమా వసూలు చేసేసింది. ఇక కృష్ణా జిల్లా విషయానికే వస్తే, అక్కడ అత్యధిక షేర్ ను రాబట్టిన సినిమాల్లో ఈ సినిమా 6వ స్థానంలో నిలిచింది. మొదటి అయిదు స్థానాల్లో 'బాహుబలి 2' .. 'రంగస్థలం' .. 'బాహుబలి' .. 'భరత్ అనే నేను' .. 'ఖైదీ నెంబర్ 150' నిలిచాయి. 25 రోజుల్లో 'ఎఫ్ 2' అక్కడ 5 కోట్ల షేర్ ను సాధించి, 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలా 'ఎఫ్ 2' తాజాగా మరో రికార్డును దక్కించుకుందన్న మాట.