ఆసక్తి రేపుతున్న వెంకటలక్ష్మి

08 Feb,2019

నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో రాయ్ లక్ష్మీతో పాటు పూజిత పొన్నాడ కూడా హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కాగా ఈ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదల అయింది. టీజర్ లో రాయ్ లక్ష్మీ తన అందంతో కట్టిపడేసింది. ఆకట్టుకునే ఎక్స్ ప్రెషన్స్ తో.. చక్కని అభినయం ఉన్న కళ్ళతో.. మరియు అందమైన రూపంతో నెటిజన్లను రాయ్ లక్ష్మీ బాగానే మెప్పించింది. దీనికి తోడు హరి గోరా అందించిన సంగీతం కూడా చాలా బాగుంది, టీజర్ స్థాయిని పెంచింది.  రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నవీన్ నేని, మహాత్ మరియు పంకజ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.  

Recent News