బాక్సింగ్ ట్రైనింగ్ లో వరుణ్ బిజీ

07 Feb,2019

'ఎఫ్ 2' సినిమాతో ఏడాది ప్రారంభంలోనే  సక్సెస్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆయన తదుపరి సినిమా హరీశ్ శంకర్ తో వుండనుంది.  తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా .. సిద్ధార్థ్ చేసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాను రీమేక్ చేయడానికి హరీశ్ శంకర్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, బాబీసింహా పాత్ర కోసం వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ పాత్ర కోసమే వరుణ్ తేజ్ బాక్సింగ్  లో శిక్షణ తీసుకోవడం కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తికాగానే ఆయన తిరిగొచ్చి ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. ఇక తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రకిగాను శ్రీవిష్ణును తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కథానాయికగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది.

Recent News