ఆర్ ఎక్స్ దర్శకుడి మహా సముద్రం

07 Feb,2019

గత ఏడాది ఆర్ ఎక్స్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతి తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే నితిన్ తో సినిమాకు సిద్దమైన అజయ్ భూపతి తాజాగా మరో సినిమాకు వర్కవుట్ చేస్తున్నాడు. నితిన్ సినిమా టైం పట్టేలా ఉండడంతో ఈ లోగా బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నాడట. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ను ఎంపిక చేసే ఆలోచనలు ఉన్నాయట. 

Recent News