ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు బోయపాటి. ఇక ఈచిత్రంలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మించనుంది. ఏప్రిల్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎన్టీఆర్ కథానాయకుడు తో బాలయ్య , వినయ విధేయ రామ తో బోయపాటి ఈ ఏడాది ప్రారంభం లో డిజాస్టర్ లను చవి చూశారు. దాంతో ఈ చిత్రం తో సాలిడ్ హిట్ కొట్టి ఈ ఇద్దరు స్ట్రాంగ్ గా కం బ్యాక్ కావాలని భావిస్తున్నారు. ఇక ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన సింహ , లెజెండ్ భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.