హుషారుగా యాభై రోజుల వేడుక

06 Feb,2019

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న విడుదలై 50 రోజుల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో 50 డేస్‌ను సెల‌బ్రేట్ చేశారు. ఈ సంద‌ర్భంగా...నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``మా `హుషారు` సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్. సినిమా ఇంత పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌ని నేను ఊహించ‌లేదు. కొన్ని ఏరియాల్లో షిఫ్టింగ్‌తో.. శ్రీ మ‌యూరిలో ఫుల్ ర‌న్‌తో 50 రోజులు వ‌ర‌కు సినిమా ర‌న్ అయ్యింది. హార్డ్‌వ‌ర్క్‌కి మంచి పేరు వ‌స్తుంద‌నడానికి మా సినిమానే కార‌ణం. ఈ సినిమా కోసం యూనిట్ అంద‌రం ఏడాదిన్న‌ర పాటు క‌ష్‌్ప‌డ్డాం. నాకు కూడా గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌. సినిమాకు సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చిన రెస్పాన్స్‌తో మాలో న‌మ్మ‌కం బాగా పెరిగింది. శ్రీహ‌ర్ష చాలా ఓపిక‌గా, ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశాడు. ఎంటైర్ యూనిట్‌కు, నాకు స‌హ‌క‌రించిన వారికి థాంక్స్‌`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``సినిమా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగా ఉంద‌ని, ఆడేలా ఉందని చెప్పాను. నిజంగానే సినిమాను ప్రేక్ష‌కులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడేదే క‌ష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.
ప్రియా వ‌డ్ల‌మాని మాట్లాడుతూ - ``మా చిన్న సినిమా 50 రోజులు ఆడటం గొప్ప విష‌యం. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.
శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ - ``నా లైఫ్‌లో ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిరోజూ బెస్ట్ మెమొరీ. ప్రేక్ష‌కులు సినిమాను రిపీటెడ్‌గా చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. నేను చెప్పిన 5 నిమిషాల క‌థ విని.. ఎగ్జ‌యిట్ అయ్యి సినిమాను చేయ‌డానికి నాతో ట్రావెల్ చేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్‌కు మా కంటే ఎక్స్‌పీరియెన్స్ ఉన్నా.. మాతో ఫ్రెండ్స్‌లా క‌లిసి పోయి సినిమా చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

Recent News