అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి 'హలో' అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశారు. సోమవారం 'హలో' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కింగ్ నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. దీనితోపాటు సినీ ప్రముఖులు 'హలో' అంటూ చిత్ర యూనిట్‌ని విష్ చేసిన వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మొదలైన 'హలో' అనే పలకరింపును కాజల్, ప్రభాస్, శ్రుతిహాసన్, రామ్‌చరణ్, నాగచైతన్య, వరుణ్‌తేజ్, సమంత, సూర్య, నాని, వెంకటేష్, రాజమౌళి, రకుల్ ప్రీత్ సింగ్, రానా కొనసాగించగా చివరలో అక్కినేని నాగార్జున 'ఆర్ యూ రెడీ.. నాన్న మీరే చెప్పండి' అనగానే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 'హలో.. హలో..' అంటూ రావడంతో అఖిల్ అక్కినేని కొత్త సినిమా 'హలో' ఫస్ట్ లుక్ విడుదలైంది.
కింగ్ నాగార్జునకు డిసెంబర్ సెంటిమెంట్‌గా బాగా కలిసొచ్చిన నెల. అందువల్ల 'హలో' చిత్రాన్ని కూడా డిసెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, రచన, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.