బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఇప్పటివరకూ ఒక్క సాలిడ్ హిట్ కూడా రాలేదుగానీ ప్రాజెక్టులు మాత్రం ఒకదాని తర్వాత సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'సీత' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 'RX100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతాను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా చర్చలు సాగుతున్నాయని.. సమంతా కూడా సినిమాకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ సినిమా 'అల్లుడు శీను' లో సమంతానే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మరోసారి 'అల్లుడు శీను' జోడీ రిపీట్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్ తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకూ దాదాపుగా టాప్ హీరోయిన్లతోనే నటించాడు. సమంతా.. కాజల్ అగర్వాల్.. తమన్నా..ఇలా .