జననేతగా తెలుగు వార్ గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికున్న క్రేజ్ ఏంటో తెలిసింది. ఇటీవలే ప్రీమియర్ షో మొదటి టికెట్ ను సీటెల్ లో వేలం వేశారు. 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. ఈ వేలంలో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని నిర్మాతలు తెలిపారు. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ... మమ్ముట్టి గారు వైఎస్ఆర్ గారి పాత్రలో నటించిన యాత్ర చిత్రాన్ని ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఈ సందర్బంగా యాత్ర ప్రీమియర్ ఫస్ట్ టికెట్ ను వేలం వేశాం. ఈ వేలంలో వైఎస్ఆర్ అభిమాని మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. ఈ డబ్బుతో రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం వినియోగిస్తారు. ఈ వేలంలో పాల్గొన్న వారందరికీ స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అని అన్నారు.