సాయి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణ పెండ్యాల నిర్మిస్తున్న చిత్రం సీమరాజా. శివకార్తికేయ, కీర్తి సురేష్, సమంత ప్రధాన తారాగణం. ఈ చిత్రం డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్‌తో ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్మాత సాయికృష్ణ పెండ్యాల మాట్లాడుతూ... నేను డిస్ట్రిబ్యూర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా ఇది నా 4వ చిత్రం. గతంలో నేను మూడు చిత్రాలు నిర్మించాను. దండుపాళ్యం 3, కురుక్షేత్రం, మారి 2 చిత్రాలను నిర్మించాను. ఈ చిత్రం కొనడానికి ప్రధాన కారణం. నా ఫ్రెండ్ ఒకరు ఈ సినిమాలోని ఒక డైలాగ్ పంపించారు. ఆ డైలాగ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. మనిషి బ్రతకడానికి మిత్రుడు ఎంత ముఖ్యమో శత్రువు కూడా అంతే ముఖ్య ం అన్న డైలాగ్ చాలా నచ్చింది. ఆ డైలాగ్ నాలో తెలియని ఒక ఫీలింగ్ని తెచ్చింది. ఆ డైలాగ్తో సినిమా చెయ్యడానికి సిద్ధపడ్డానికి ఒకేసారి విడుదల చేద్దామనుకున్నా కాకపోతే అదే సమయంలో సమంతవి రెండు సినిమాలు ఉండడం వలన చెయ్యలేకపోయాను. దాని తర్వాత డబ్బింగ్ అన్నీ బాగా నేషనల్వైడ్గి కుదిరింది. చంద్రబోస్, వెన్నెలకంటిగారితో పాటలు రాయించాము. ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు. శ్రేయా ఘోషల్‌తో ఒక పాట పాడించాము. ప్రతిదీ హై టెక్నీషియన్లతో సినిమా చెయించాం. మీకు ఎక్కడా కూడా డబ్బింగ్ సినిమా చూస్తున్నాము అన్న ఫీలింగ్ కలగదు. కేవలం డబ్బింగ్కే 60 లక్షలు ఖర్చుపెట్టాను. ఒక స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చూసిన ఫీలింగ్ రావాలని అంత ఖర్చుపెట్టాను. వీడియో గీతాన్ని విడుదల చేస్తే దాదాపు 10లక్షల వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ని ఈ రోజు ఉదయం విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన తెలుగుకి కనెక్ట్ అయ్యే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కీర్తిసురేష్, సమంత ఉన్నారు. కీర్తిసురేష్ యువరాణి గెటప్ ఒక 30 నిమిషాల పాటు ఉంటారు సినిమాలో. సమంత మెయిన్ హీరోయిన్ సినిమా మొత్తం టీచర్గా చేస్తుంది. నెపోలియన్గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ హీరో శివకార్తికేయన్. గతంలో దిల్రాజుగారు రెమో చిత్రంతో ఇక్కడ పరిచయం చేశారు. రెండవ చిత్రం మాది. మెయిన్గా ఇందులో చెప్పుకోదగ్గది సిమ్రన్గారిని ఇప్పటివరకు ఒక మంచి గ్లామరస్ హీరోయిన్గా చూశారు. మొట్ట మొదటి సారి విలన్గా చేశారు. ఈ చిత్రంలో విలన్ సిమ్రన్ చాలా బాగా చేశారు. సిమ్రన్ చెప్పే డైలాగ్ హైలెట్గా ఉంటుంది. మీరు పంచెకట్టే మగోళ్ళయితే నేను చీర కట్టిన మగోడ్ని అంటది సూపర్ డైలాగ్. సినిమాలో చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి . తెలుగులో డబ్బింగ్ చిత్రాలకు అవార్డులు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు కాని ఒకవేళ ఇవ్వవలసి వస్తే సిమ్రన్ గారికి కనీసం 10 అవార్డులైనా వస్తాయి. కథలోకి వస్తే అల్లరి చిల్లరిగా తిరిగే రాజు కుటుంబీకుడు హీరో. రాజు మొత్తం జాగ్రత్తగానే పని చేసుకుంటూ వెళతారు. ఫుల్లెంగ్త్ కమర్షియల్ మూవీ. తమిళ్లో 3 గంటల చిత్రం. శివకార్తికేయన్గారిది బాహుబలి రేంజ్లో ఫైట్లు, గుర్రాలు అన్నీ ఉంటాయి. కాని నేను ఇక్కడ అవన్నీ తీసేశాను. కేవలం రెండు గంటలు మాత్రమే పెట్టాను. అసలు రాజు అనే వాడు ఎలా ఉంటాడు ఏంటి అన్నది ఫ్లాష్బ్యాక్ ఓపెన్ అవుతుంది. సిమ్రన్ విలన్ లాల్ మళయాళం యాక్టర్ బాగా చేశారు.
సమంత కర్ర ఫైట్... మొత్తానికి ఊరికి న్యాయం చేసే రాజు అవుతాడు. రిలీజ్ మొత్తం హ్యాపీ . బిజినెస్లో ఎటువంటి ఇబ్బంది లేదు. 18 ఏళ్ళనుంచి నాది ఇదే పని. నాకు స్టేట్లో ఉన్న 2,724 థియేటర్లు తెలుసు ప్రతి జిల్లా డిస్ట్రిబ్యూషన్ తెలుసు. ఈ చిత్రం దాదాపు 300 నుంచి 400 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. సినిమాల్లో ఎప్పుడూ ఎవరూ ఎవరికీ హెల్ప్ చెయ్యరు ఎవరి పని వాళ్లు అలా చేసుకుంటూ వెళ్ళమే. మనం ఒక పది మెట్లు ఎక్కుతున్నామంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ. నైజాం నేనే చేస్తా మొత్తం. ఈ చిత్రంలో సమంత కర్రఫైట్ కూడా ఉంటుంది... అని తెలిపారు.