లక్ష్మిస్ ఎన్టీఆర్ కోసం కత్తి పట్టిన వర్మ

05 Feb,2019

సంచలన దర్శకుడు తన సినిమాకోసం కత్తి పట్టాడు. తాజాగా దానికి సంబందించిన ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ   'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు సైతం జోరుగా ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర చిత్రాలను, పాటలను విడుదల చేసిన ఆయన, తాను కత్తి పట్టుకుని ఉన్నట్టు ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ, "లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్" అని కామెంట్ పెట్టారు. ఆపై, "రేయ్... ఎన్టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదురా... ఆయన అసలు నాయకుడు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథలో తెలుస్తుందిరా. డబుల్ ఖబడ్దార్" అన్నారు. మరో ట్వీట్ ను జోడిస్తూ, "ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు. నేను ముదురు నాయకుడిని. మిగతావారు రకరకాల, వేరే రకాల నాయకులు. వెన్నుపోటు నాయకులతో సహా" అని అన్నారు. మొత్తానికి వర్మ పెట్టిన ట్విట్స్ వైరల్ అవుతున్నాయి. 

Recent News