శృతి హాసన్ రీ ఎంట్రీ ఇస్తుందిగా

04 Feb,2019

గత కొంత కాలంగా సౌత్ లో ఏ సినిమాలో నటించడం లేదు గ్లామర్ భామ శృతి హాసన్ . ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం తనను తాను రాక్ స్టార్ గా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. శృతి హాసన్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ గా కూడా సుపరిచితమే. తాజాగా ఈమె సంగీత నేతృత్వంలో న్యూ యార్క్ లో ఓ మ్యూజికల్ షో నిర్వహించి హిట్ కొట్టడంతో ఆమె కల నెరవేరింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఫోకస్ సినిమాలపై పెట్టినట్టుంది . ఈ మద్యే ఓ టివి షో కి హోస్ట్ గా కూడా చేస్తున్న శృతి తాజాగా తమిళంలో విజయ్ సేతుపతి తో జోడి కట్టేందుకు రెడీ అయింది. ఎస్పీ జననాదన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకోవాలని ఆమెతో చర్చలు జరుపుతున్నారట. కథ విన్న ఆమె కూడా ఈ సినిమాలో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. సో త్వరలోనే తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. 

Recent News