సువర్ణసుందరి ప్రమోషన్స్ ప్రారంభం

02 Feb,2019

జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి".  ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో    భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  విధంగా ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం అతి  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సువర్ణ సుందరి  కార్ల ర్యాలీ ని చిత్ర యూనిట్ గురువారం ప్రారంభించారు. ‌ఈ సందర్బంగా.. దర్శకుడు సూర్య ఎమ్‌.ఎస్.ఎన్ మాట్లాడుతూ.. సువర్ణ సుందరి ప్రమోషన్స్ ను ఈ రోజు నుంచి ప్రారంభించాము.  కార్లను సువర్ణ సుందరి థీమ్ పొస్టర్స్ తొ సిద్దం చేసి ఎపి ,తెలంగాణా అంతటా  ట్రావెల్ అయ్యెలా పబ్లిసిటీ చెయ్యనున్నాము. ఇదే కాక మరిన్ని వైవిధ్యమైన కాన్సెప్ట్ లతొ మా సినిమాను ప్రేక్షకులకు చెరువయ్యెలా ప్లాన్ చెస్తున్నాము. ఫిబ్రవరి 5న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చెస్తున్నాము. ఇప్పటికే విడుదలైన టీజర్ , పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ..  దర్శకుడు సూర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా , క్వాలిటీగా ఈ చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ దాదాపు 45 ని. ఈ సినిమాలొ ఉంటుంది. అందువల్లే సినిమా ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా రానుందన్నారు‌. సినిమాటోగ్రాఫర్ ఎల్లు మహంతి మాట్లాడుతూ.. నేనిప్పటి వరకు చేసిన చిత్రాలలొ ది బెస్ట్ వర్క్ సువర్ణ సుందరి లొనె ఉంటుంది. వందల కొట్ల భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని కంటెంట్, క్వాలిటిని ఈ సువర్ణ సుందరి లొ చూస్తారన్నారు. 

Recent News