యాత్ర ప్రీ రిలీజ్ వేడుక

02 Feb,2019

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రలో ఆయన చేపట్టిన పాదయాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఆ పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమా 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మహి.వి.రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన 'యాత్ర' చిత్రం ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్ర‌వారం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో.. సుధీర్ బాబు మాట్లాడుతూ - ``విజ‌య్‌, విష్ణు, శశి నా క్లోజ్ ఫ్రెండ్స్‌. వారు, నేను ఇండ‌స్ట్రీలోకి వ‌స్తామ‌ని అనుకోలేదు. ఇప్పుడు అంద‌రం బ‌యోపిక్స్ చేస్తున్నాం. నేను పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ చేస్తున్నాను. విష్ణు య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ చేశాడు. ఇప్పుడు విజ‌య్‌, శ‌శి వై.ఎస్‌.ఆర్‌గారి బ‌యోపిక్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక ఇన్‌స్పిరేష‌నల్ మూవీ. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వై.ఎస్‌.ఆర్ ఫ్యాన్స్‌కే కాదు.. ఇత‌ర ప్రేక్ష‌కుల‌కు కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.  మ‌మ్ముట్టిగారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు. 
నిర్మాత విజ‌య్ చిల్లా మాట్లాడుతూ - ``ఒక వారం రోజులుగా నా స్నేహితుడు శ‌శి యు.ఎస్‌లో సినిమాను ప్ర‌మోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. శ్యామ్ ద‌త్‌గారి వ‌ల్లే ఈ సినిమా చేస్తున్నాం. ఆయ‌నే ఈ సినిమా క‌థ‌ను మ‌మ్ముట్టిగారి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మమ్ముట్టిగారు మా క‌థ‌ను న‌మ్మడ‌మే కాదు.. గొప్ప స‌హకారం అందించారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. మా సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కె, ఆర్ట్ డైరెక్ట‌ర్స్ రామ‌కృష్ణ‌గారు, మోనిక‌గారు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌గారు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. సీతారామ‌శాస్త్రిగారు ఐదు పాట‌ల‌ను ఐదు సిచ్యువేష‌న్స్‌కు త‌గ్గ‌ట్టు రాశారు. పెంచ‌ల‌దాస్‌గారికి థాంక్స్‌. డైరెక్ట‌ర్ మ‌హి మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. . ఫిబ్రవ‌రి 8న సినిమా విడుద‌ల‌వుతుంది. వై.ఎస్‌.ఆర్‌గారి ఫ్యాన్స్‌కే కాదు.. ప్ర‌తి కుటుంబం సినిమా చూసి వై.ఎస్‌.ఆర్‌గారి ఆత్మ, స్ఫూర్తిని ఈ సినిమాలో చూడొచ్చు`` అన్నారు.
మ‌హి.వి.రాఘ‌వ్ మాట్లాడుతూ - ``మ‌మ్ముట్టిగారికి నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఈ సినిమాలో చూసిన యాక్టింగ్ అంతా ఆయ‌న గొప్ప‌త‌న‌మే. ఆయ‌న‌తో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఓ మెంట‌ర్‌లా న‌న్ను న‌డిపించారు. ఓ సినిమా అనేది మొత్తం టీమ్‌కు సంబంధించిన వ‌ర్క్‌. క‌థ మాత్ర‌మే నాది. అక్క‌డి నుండి సినిమాగా రూపొందే క్ర‌మంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంద‌రో స‌హ‌కారం అందించారు. అందుక‌ని ఈ సినిమా నాది అని చెప్పుకోను.  నాకు స‌హ‌క‌రించిన నా టీంకు థాంక్స్‌. నేను నిర్మాత‌గా కెరీర్‌ను అనుకోకుండా స్టార్ట్ చేశాను. నేను డైరెక్ట‌ర్‌గా మారడానికి కార‌ణం విజ‌య్‌, శ‌శియే కార‌ణం. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. నాకు, వై.ఎస్‌.ఆర్‌గారికి ఏ సంబంధం లేదు. ఇలాంటి క‌థ‌ల‌ను ఎంద‌రో ఎన్నో ర‌కాలుగా చెప్పి ఉండొచ్చు. అలాంటి క‌థ‌ల‌ను విన‌డం వ‌ల్ల‌నే నేను రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి క‌థ చేద్దామ‌ని అనుకున్నాను.   జ‌గ‌నన్న గురించి ఓ విష‌యం చెప్పాలి. నేను ఎక్క‌డికైనా దూకిన త‌ర్వాత ఆలోచిద్దాంలే అనుకునే టైప్‌. స్క్రిప్ట్ అంతా రాసేశాను. మ‌మ్ముట్టిగారు రెడీ అయిపోయారు. నేను గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ అన్న‌ను క‌లిసి ఇలా నేను పాద‌యాత్ర‌పై సినిమా చేద్దామ‌ని అనుకుంటున్నాను అని చెప్పాను. మా నాయ‌న ఏం చేశాడో చూపించు, ఆయ‌న చేయ‌ని దానికి క్రెడిట్ ఆపాదించొద్దు అన్నారు. సినిమా మొత్తం పూర్త‌యిన త‌ర్వాత ట్రైల‌ర్ చూడ‌మంటే చూసి బావుంద‌న్నారు. సినిమా చూస్తారా? అన్న.. అన్నాను. ``మీ నాయ‌కుడు క‌థ మీరు చెప్పారు న‌న్నేం చేయ‌మంటారు`` అన్నారే కానీ.. మా నాన్న క‌థ అని అన‌లేదు. అది ఆయ‌న గొప్ప‌త‌నం.  ఇది అంద‌రి సినిమా. ఎమోష‌న‌ల్‌గా, హానెస్ట్‌గా ఉండే సినిమా. చూసిన‌ప్పుడు రియ‌ల్‌గా ఫీల్ అవుతారు`` అన్నారు. మ‌మ్ముట్టి మాట్లాడుతూ - ``నేను తెలుగు మాట్లాడ‌లేను. కానీ అర్థం చేసుకుంటాను. కానీ సినిమా కోసం క‌ష్ట‌ప‌డి నేర్చుకున్నాను. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇటాలియ‌న్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాష‌ను పిలుస్తారు. క‌వితాత్మ‌క‌మైన భాష‌. ఇలాంటి సినిమా చేసిన ప్ర‌తి ఒక న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుడికి థాంక్స్‌. నాతో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న రా స్నేహితుడు శ్యామ్ ద‌త్ ఈ సినిమా క‌థ గురించి చెప్పారు. స‌రేన‌ని క‌థ విన్నాను. 21 ఏళ్ల త‌ర్వాత తెలుగులో సినిమా చేయ‌డానికి చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి జీవితంలో చేసిన పాద‌యాత్ర అనే ఘ‌ట‌న‌కు సంబంధించిన క‌థ‌. ఆయ‌న స్ర్కిప్ట్ తో క‌న్విన్స్ అయ్యాను.  తెలుగులో నేను న‌టించిన మూడో స్ట్ర‌యిట్ తెలుగు మూవీ అన్నారు.

Recent News