అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’ సినిమా తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సయేశా సైగల్. అయితే ఈచిత్రం పరాజయం చెందడం తో తెలుగులో మాత్రం అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. ఆ తరువాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయిపొయింది. ఈ హీరోయిన్ తమిళ హీరో ఆర్య ను పెళ్లి చేసుకోనుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో వున్నారు. గజినీకాంత్ షూటింగ్ టైం లో ఆర్య , సయేశా లమధ్య మంచి అనుబందం ఏర్పడిందట. ఇక వీరిద్దరి పెళ్లి కి వారి కుటుంభ సభ్యులు కూడా అగీకారం తెలిపారని సమాచారం. మార్చి 9 , 10న హైదరాబాద్ లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగనుందట.