అఖిల్ నెక్స్ట్ సినిమా శ్రీను వైట్లతో

31 Jan,2019

అక్కినేని  అఖిల్ మూడవ ప్రయత్నంలో కూడా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ రెండవ సినిమా హలో తో పర్వాలేదనిపించిన అఖిల్ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం ఉపయోగపడలేదు. ఇక ముచ్చటగా మూడోచిత్రం మిస్టర్ మజ్ను  యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు అఖిల్ నాల్గవ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల వరస పరాజయాలతో బాగా వెనకపడిపోయిన డైరెక్టర్ శ్రీను వైట్ల, అఖిల్ కోసం స్టోరీ ని సిద్ధం చేస్తున్నాడట. అంతేకాదు ఇటీవల శ్రీను వైట్ల, అఖిల్ తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దాంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట. మరి శ్రీనువైట్ల తో సినిమాకి నాగార్జున ఒప్పుకుంటాడా లేదో చూడాలి. 

Recent News