అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మళ్లీ మళ్లీ చూశా". క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు.శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం లొని "చినుకే నాకె చూపె" అనే పాట ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెన్సేషనల్ డైరక్టర్ వినాయక్ విడుదల చేశారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. "మళ్లీ మళ్లీ చూశా" పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్ సైతం అందంగా అందరికీ చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ .. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తొ తీసిన సినిమా "మళ్ళీ మళ్ళీ చూశా" . శ్రవణ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్ గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా చిత్రం లోని మొదటి పాటను వినాయక్ గారు విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మనస్సుకు హత్తుకునే అహ్లాదకరమైన చిత్రం మా "మళ్లీ మళ్లీ చూశా" అన్నారు. హీరొ అనురాగ్ మాట్లాడుతూ.. వి .వి వినాయక్ గారు మొదటి పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది . తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తోన్న ఆహ్లాదకరమైన ప్రేమ కధా చిత్రం. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మళ్లీ మళ్లీ చూడాలనిపించె ప్రేమకథ ఇదన్నారు.