పాటల్లో 4 లెట‌ర్స్‌

30 Jan,2019

ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతు ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం 4 లెటర్స్. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి పాటల సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, శివాజీ రాజా, నటుడు సురేష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ... చక్కని టైటిల్ .. ప్రేమ అని చెప్పకుండా 4 లెటర్స్ అని కొత్తగా పెట్టారు. పాటలు బాగున్నాయ్. తప్పకుండ సినిమా పరిశ్రమకు ఇప్పుడు కొత్త టాలెంట్ అవసరం . ఈ మధ్య భిన్నమైన సినిమాలు సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాతో తమ అబ్బాయిని హీరోగా చూడాలనుకున్న ఉదయ్ గారి కల నెరవేరుతుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ .. సినిమా తీయాలన్న ఆశ కలిగిందంతే అది ఎక్కడ ఉన్నా వదిలి పెట్టాడు .. సినిమా చేసేలా చేస్తుంది .. అలాగే మేముకూడా ఎక్కడెక్కడినుండో వచ్చాము. నిర్మాత ఉదయ్ కూడా సినిమా మీద ప్యాషన్ తో వచ్చాడు. ఇలాంటి నిర్మాతల వల్లే ఈ రోజు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ సంతోషంగా ఉంది. ఇలాంటి నిర్మాతలు రావాలి. తప్పకుండా ఈ 4 లెటర్స్ చిత్రం మంచి  విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.   నిర్మాత‌  ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం, అది మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాం.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం.  ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల చేస్తాం అన్నారు. 
ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌.  నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే 'కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది.  అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. 


 

Recent News