భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘పిఎం.నరేంద్ర మోడీ’. టైటిల్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను 23 భాషల్లో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టారు. ‘సరజ్జిత్’, ‘మేరీకోమ్’ వంటి బయోపిక్ చిత్రాలను తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బోమన్ ఇరానీ, దర్శన్ కుమార్ ముఖ్యపాత్రధారులు. సురేష్ ఒబెరాయ్, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటుగా ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తారు.