ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటున్న వేగేశ్న సతీష్

29 Jan,2019

‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రాల ఫేమ్‌ సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారు.  హీరో ఎవరనేది ఇంకో వారం రోజుల్లో ఫైనల్‌ కానుంది. ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా  పతాకంపై ఉమేష్‌ గుప్తా నిర్మించనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Recent News