మహర్షి సాటిలైట్ హక్కులకు భారీగా క్రేజ్

30 Jan,2019

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’.  ప్రస్తుతం   తమిళనాడులోని పొల్లాచిలో ఈ రోజుతో షూటింగ్ ముగిసిందని తెలుస్తోంది, తరువాత షెడ్యూల్   హైదరాబాద్ లో చేయనుంది.దాంతో పాటు  చివరి షెడ్యూల్ ను అబూ ధాబీలో చేస్తారట.  మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు , అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. సాటిలైట్ హక్కుల విషయంలో గట్టి పోటీ మధ్య జెమినీ టివి సొంతం చేసుకోవడం విశేషం . ఇప్పటికే బిజినెస్ హక్కుల విషయంలో భారీ క్రేజ్ నెలకొంది.  వచ్చే ఏడాది ఏప్రిల్లో  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent News