కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'దేవ్' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న విడుదలైన ఆడియోకి విశేష స్పందన లభించగా, హారిస్ జయరాజ్ ఈ సినిమా కు సంగీతం సమకూరుస్తున్నారు.. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఖాకీ' లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ కలయిక లో వస్తున్నచిత్రమిది.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తుండగా, నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తుంది..ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోగా, తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో సినిమా విడుదల అవుతుంది.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.