శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఉందట

29 Jan,2019

బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించేసింది.    ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు కూడా నటించడం లేదు. రీసెంట్ గా లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ 'మహానటి' గురించి మాట్లాడుతూ ఆ చిత్రం తనమీద ఎంతో ప్రభావం చూపించిందని.. తనకు శ్రీదేవి బయోపిక్ లో నటించాలనే ఆలోచన కలిగిందని చెప్పింది.   అంటే ఈ సారి పూర్తిస్థాయి శ్రీదేవి బయోపిక్ లో నటించాలని అమ్మడి మనసులో ఉందన్నమాట.   ఇప్పటికే ఒకసారి శ్రీదేవి పాత్రలో నటించింది కాబట్టి బోనీ ఎప్పుడు శ్రీదేవి బయోపిక్ నిర్మాణం మొదలుపెట్టినా రకుల్ ప్రీత్ సింగ్ పేరును పరిశీలిస్తాడనడం లో మాత్రం ఏం సందేహం లేదు.   తమిళంలో కార్తి 'దేవ్'.. సూర్య 'ఎన్ జీ కే' లో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఏడాది టచ్ లో ఉన్నట్టే. ఇవి కాకుండా మరో రెండు హిందీ ప్రాజెక్టులు కూడా సెట్స్ పై ఉన్నాయి. 
 

Recent News