పెళ్లి కి సిద్దమైన అనిషా అంబ్రోస్

28 Jan,2019

మొత్తానికి పలు తెలుగు సినిమాలతో తళుక్కున మెరిసిన ఓ యంగ్ హీరోయిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ‘అలియాస్ జానకి’ ‘నగరానికి ఏమైంది?’లతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చాలా సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయం గురించి ఆమె రివీల్ చేస్తూ.. తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా జేఎంఆర్ కన్‌స్ట్రక్షన్ ఈడీ గుణ జక్కతో అనీషా నిశ్చితార్థం జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకూ అనీషా ఆంబ్రోస్ దాదాపు పది చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

Recent News