శ్రీదేవి ప్రసన్న మూవీస్ బ్యానర్ పై దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ రూపొందించిన సరికొత్త షార్ట్ ఫిలిం "నన్ను క్షమించండి". గతంలో ఇదే బ్యానర్ పై రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన "లడ్డు" ఏ స్వీట్ మొమరీ మంచి ప్రేక్షకాదరణతో పాటు 28 ఇంటర్నేషనల్ అవార్డులు, 3 కేటగిరీల్లో 4 నంది పురస్కారాలు లభించాయి. పి.కృష్ణకాంత్, రాఘవ్ ఓంకార్ శశిధర్ సంయుక్తంగా నిర్మించిన "నన్ను క్షమించండి" షార్ట్ ఫిలింకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించగా... శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫి అందించారు. "నన్ను క్షమించండి" ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై తమ అభినందనల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .... శశిధర్ మంచి దర్శకుడు అని లడ్డుతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు నన్ను క్షమించండి పేరుతో ఓ మంచి ఆలోచనాత్మక షార్ట్ ఫిలిం రూపొందించాడు. ఓ మంచి కథ చెబితే శశిధర్ తో సినిమా నిర్మించడానికి నేను రెడీ. లడ్డు, నన్ను క్షమించండి రెండు లఘు చిత్రాలు కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు రావాలి. భూతు డైలాగ్స్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు వస్తున్న ఈ కాలంలో కూడా వల్గారిటీ లేకుండా రూపొందిస్తున్న ఇలాంటి మంచి సినిమాలు కావాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడే నాకు ధైర్యం వస్తుంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తపనతో, కసితో పని చేస్తారు. శశిధర్ త్వరలో మంచి దర్శకుడు అవుతాడు. తండ్రి కొడుకు మధ్య హ్యూమన్ ఎమోషన్ ని చాలా బాగా చూపించాడు. అందరూ చాలా బాగా నటించారు. అని అన్నారు. దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ.... నా దర్శకత్వంలో వచ్చిన లడ్డు షార్ట్ ఫిల్మ్ కి చాలా అవార్డులు వచ్చాయి. మంచి పేరొచ్చింది. దాంతో ఇక షార్ట్ ఫిల్మ్ చేయొద్దు అనుకున్నా. కానీ కృష్ణకాంత్ గారు కలిశారు. ఆయన షార్ట్ ఫిల్మ్ చేయమని అడిగిన పద్ధతి నాకు బాగా నచ్చింది. ఆయన నన్ను కన్విన్స్ చేశారు. కేవలం ఆయన కోసం మళ్లీ షార్ట్ ఫిల్మ్ చేశాను. నన్ను క్షమించండి కోసం చాలా మంది కష్టపడ్డారు. కేవలం నాకోసం కష్టపడ్డారు. అందరికీ థాంక్స్. డిఓపి శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ సినిమాల్లో బిజీగా వున్నప్పటికీ... నాకోసం పని చేసి మంచి షార్ట్ ఫిలిం వచ్చేందుకు కృషి చేశారు. రవి వర్మ తన సినిమా అనుకోని పనిచేశారు. తాగుబోతు రమేష్, గిరి అన్న చాలా సపోర్ట్ చేశారు. పేరు పేరునా అందరికీ థాంక్స్ చెబుతున్నాను. నెక్ట్స్ షార్ట్ ఫిల్మ్ తో కాకుండా సినిమాతో మీ ముందుకు వస్తా అని నమ్మకంతో చెబుతున్నాను. అని అన్నారు.