శేఖర్ మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ ఎస్.నిర్మంచిన చిత్రం ఈ2మనసులు.ఆది పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీసెంటిమెంట్‌తో తెరకెక్కుతుంది. రవిచంద్ర, సుమయ కథానాయకులుగా పరిచమవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ 70శాతం పూర్తిచేసుకుంది. చివరి షెడ్యూల్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని సమ్మర్‌లో ఈ 2 మనసులు కూల్‌గా మీ ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఫిలింఛాంబర్‌లో టీజర్ మరియు సాంగ్‌ను విడుదల చేశారు. విలేకరుల సమావేశంలోచిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఈ సినిమాలో నాతమ్ముడు సత్య నాకు చాలా హెల్ప్ చేశారు. స్ర్కిప్ట్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌గారికి మేము రుణపడి ఉంటాము. ఇది ఒక లవ్ స్టోరీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. ప్రొడ్యూసర్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవాళ్ళు అయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టోరీ రెడీ అయ్యాక మేం చాలా మంది పెద్ద హీరోల వద్దకు వెళ్ళి అడిగితే ఎవ్వరూ మాకు డేట్స్ ఇవ్వలేదు. అందరూ బ్యానర్ ఏంటి, సినిమా వస్తదా లేదా అని అడుగుతున్నారు. దీంతో అందరూ కొత్తవాళ్ళనే తీసుకున్నాం. ఎప్పటికైనా ఇది చాలా పెద్ద బ్యానర్ అవుతుందని ఆశిస్తున్నాను. మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తేనే మంచి కథలతో మీ ముందుకు రాగలము అని అన్నారు.
హీరో మాట్లాడుతూ... ఈ మధ్య వచ్చిన లవ్‌స్టోరీస్ కి చాలా భిన్నంగా ఉంటుంది ఈ చిత్రం. తప్పకుండా మా సినిమాని అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. నాకు మా డైరెక్టర్ గారు అంతా దగ్గరుండి చెప్పి చెయించుకున్నారు. మా నుంచి ఆయనకు ఎటువంటి నటన కావాలో అది ఆయన రాబట్టుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.