మెగా అమ్మాయి నిహారిక కొణిదల టైటిల్ పాత్రలో నటిస్తున్న సూర్యకాంతం సినిమా టీజర్ ఇటీవలే విడుదలైనా లక్ష వ్యూస్ తెచ్చుకుంది. నిహారిక హీరోయిన్ గా పరిచయం అయిన ఒక్క మనసు ఆశించిన స్థాయి సక్సెస్ కాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఈ మద్యే హ్యాపీ వెడ్డింగ్ అంటూ మరో సినిమాలో నటించింది కానీ ఆ సినిమా ఫలితం కూడా అలాగే ఉండడంతో .. ఇక వరుస ప్రయత్నాలు మొదలు పెట్టింది. సూర్యకాంతం గా టైటిల్ రోల్ పోషిస్తున్న నిహారిక ఈ సినిమాతో ఆకట్టుకునేలా ఉంది.