మన రౌడీ ఫోకస్ కోలీవుడ్ పై పడిందే

27 Jan,2019

సెన్సేషన్ విజయ్ దేవరకొండ  ఇప్పటికే తమిళ మార్కెట్ పై ఫోకస్ చేశాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా'  తమిళ -తెలుగు ద్విభాషా చిత్రం తో తన లక్కును టెస్టు చేసుకున్నాడు కానీ సినిమా నిరాశపరిచింది. అలా అని తన ప్రయత్నాలు ఆపడం లేదట.  ప్రస్తుతానికి లైన్లో ఉన్న రెండు సినిమాలు 'డియర్ కామ్రేడ్'.. క్రాంతి మాధవ్ ప్రాజెక్ట్ మాత్రం తెలుగు మార్కెట్ కోసమే గానీ ఆ తర్వాత చేయబోయే సినిమా మాత్రం తమిళ-తెలుగు బై లింగువల్ అని టాక్.  ఈమధ్యే ఒక నూతన దర్శకుడు  ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ చెప్పి విజయ్ ను మెప్పించాడట.  కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  ప్రస్తుతం లైన్లో ఉన్న రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.  'నోటా' కోసం తమిళ భాషను నేర్చుకొనిమరీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న విజయ్ ఈ సారి తమిళభాషపై మరింతగా పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తున్నాడట.  

Recent News