ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం '' చంద్రోదయం ''. పి . వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ & శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది . ఇప్పటికే రాంగోపాల్ వర్మ వెన్నుపోటు పాట కు వ్యతిరేకంగా రిలీజ్ చేసిన పాటతో సంచలనం సృష్టించిన దర్శకుడు పి . వెంకట రమణ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ '' చంద్రబాబు నాయుడు భారతదేశం గర్వించతగ్గ నాయకుడని , అపారమైన తన మేథా సంపత్తితో ఆంధ్రప్రదేశ్ ని అగ్ర పథాన నిలిపాడని , 68 ఏళ్ల వయసులోనూ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని అందుకే అలాంటి మహానుభావుడి కష్టం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళకు తెలియజేయడానికే ఈ చంద్రోదయం చిత్రాన్ని రూపొందిస్తున్నామని ....... చంద్రబాబు బయోపిక్ ఎందుకు తీస్తున్నావని అడిగే వాళ్లకు మా చంద్రోదయం సరైన సమాధానం చెబుతుందని, ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 31న నిర్వహించనున్నామన్నారు. చిత్ర నిర్మాత జి జె రాజేంద్ర మాట్లాడుతూ " చంద్రబాబు నాయుడి బయోపిక్ తీసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది . డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాని విడుదల చేస్తామన్నారు.
వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.