బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న ఎఫ్ 2

25 Jan,2019

వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'F2' జనవరి 12 న విడుదలైంది.  సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు ఇతర సినిమాలు పోటీ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.  పండగ సీజన్లో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ దండిగా ఉండడం .. వెంకీ చెలరేగిపోవడంతో ఈ సినిమాకు జనాలు క్యూ లు కడుతున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం  పన్నెండు రోజులకు  తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది.  వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 34.50  కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఈ సినిమా వందకోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఈ ఫన్ 2 ఫ్రష్ట్రేషన్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం .. షేర్ లలో..  

నైజాం : 17.30 కోట్లు, 
సీడెడ్: 6.53 కోట్లు, 
ఉత్తరాంధ్ర: 7.70 కోట్లు, 
కృష్ణ: 4.16 కోట్లు, 
గుంటూరు: 4.25 కోట్లు, 
ఈస్ట్ : 5.76 కోట్లు, 
వెస్ట్: 3.29 కోట్లు, 
నెల్లూరు: 1.52 కోట్లు, 
మొత్తంగా .. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  50.48 కోట్లు, షేర్ వసూలు చేసింది .. ఇక గ్రాస్ లో చూసుకుంటే .. దాదాపు 68 కోట్లు. 

Recent News