ఇస్మార్ట్ శంకర్ ఇస్టార్ట్ చేసాడు

24 Jan,2019

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం బుధవారం రోజు అధికారికంగా ప్రారంభమయ్యింది.. ' ఇస్మార్ట్ శంకర్ ' అనే టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హీరోయిన్ చార్మీ కౌర్ క్లాప్ కొట్టగా, చిత్ర తొలి షాట్ ని హీరో పై తెరకెక్కించారు.. స్రవంతి రవికిశోర్ కెమెరా స్విచాన్ చేశారు.. ఈ సినిమా లో రామ్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా,రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది... యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి..

Recent News