సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట చిత్రం ఇటీవల విడుదలై 100కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈచిత్రం తరువాత రజినీ , మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో తలైవా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే రజినీ ఇప్పట్లో సినిమాలకు గుడ్ బై చెప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటె తనను పేట లో స్టైలిష్ గా చూపించి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు రజినీ మరో ఛాన్స్ ఇవ్వనున్నాడని టాక్ అలాగే తన గతచిత్రాల్లో కొన్ని సినిమాలకు సీక్వెల్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది తలైవా. సో మరో 5 సంవత్సరాల పాటు ఆయన సినిమాల్లో కొనసాగే అవకాశం ఉందన్నమాట. ఇక మరోవైపు రజినీ పొలిటికల్ పార్టీ ని కూడా స్థాపించిన విషయం తెలిసిందే. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి.