రాజుగారిగది-2, ఆఫీసర్, దేవదాస్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద అంచనాలకు చేరువకాలేకపోవడంతో నెక్స్ట్ సినిమాల విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాడు నాగ్. చాలాకాలంగా వినిపిస్తున్నట్లుగా బంగార్రాజు టైటిల్ పాత్రలో ఆయన నటించబోయే చిత్రాన్ని సెట్స్‌పైకి తెచ్చేందుకు తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో బంగార్రాజు పాత్రలో అదరగొట్టాడు నాగార్జున. ఎట్టకేలకు స్క్రిప్టు కొలిక్కి రావడంతో ఈ చిత్రానికి రంగం సిద్ధమైందని, మార్చిలో షూటింగ్‌ను ప్రారంభిస్తారని టాక్ . కల్యాణ్‌కృష్ణ దీనికి దర్శకత్వం వహించనున్నారు. దాంతో పాటు నాగార్జున మరో చిత్రాన్ని కూడా లైన్‌లో పెడుతున్నారు.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు…ఆ చిత్రం స్క్రిప్టు పనుల్లో ఉన్నట్లు నాగార్జున పలు సందర్భాలలో చెప్పారు కూడా. గతంలో వచ్చిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్‌గా మన్మధుడు-2 పేరుతో ఈ చిత్రం ఉంటుందని నాగ్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే నాగార్జునకు స్క్రిప్ట్‌ను రాహుల్ రవీంద్రన్ వినిపించారని, వెంటనే ఓకే చెప్పాశారని టాక్ మొత్తానికి వరుసగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు నాగ్.