రెండో పెళ్ళికి సిద్దమైన ర‌జ‌నీ కుమార్తె

24 Jan,2019

సూప‌ర్ స్టార్ ర‌జనీ  కుమార్తె సౌంద‌ర్య వివాహం చెన్నైలో ఫిబ్ర‌వ‌రి 11వ తేదిన జ‌ర‌గ‌నుంది.. ఈ మేర‌కు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.. 2010లో అశ్విన్ ను వివాహం చేసుకున్న సౌంద‌ర్య 2017లో అత‌డి నుంచి విడాకుల పొందారు.. గ‌త ఏడాది సౌంద‌ర్య న‌టుడు, వ్యాపార‌వేత్త విశ్వ‌గ‌ణ్ తో నిశ్చితార్ధం జ‌రిగింది.. తాజాగా వివాహ తేదిన ఇరు కుటుంబాలు ప్ర‌క‌టించాయి. విశ్వగణ్‌కి కూడా ఇది రెండో వివాహమే కాగా, ఆయ‌న ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా న‌టించాడు.
 

Recent News