"నీళ్ళుంటే కరెంటు వుండదు.. కరెంటు వుంటే నీళ్ళుండవు..రెండూ వుండి పంట చేతికొస్తే సరైన ధర వుండదు. అందరూ రైతే రాజంటారు..సరైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచరికం మాకొద్దయ్య..మమ్మల్ని రాజులుగా కాదు కనీసం రైతులుగా బ్రతకనివ్వండి చాలు..అని ప్రతి రైతు గొంతెత్తి అరుస్తున్న సమయం అది.. ఎవరైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన సమయం లో ఒక గొంతుక వినిపించింది.." నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు పేద ప్రజలవైవు నిలుచుంది.. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాము కాని జనానికి ఏం కావాలో తెలుసుకొలేకపోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి ప్రజాయాత్ర ని పాదయాత్ర గా ప్రారంభించిన జననేతగా , మహనేతగా పేద ప్రజల గుండె చప్పుడుగా ఎప్పటికి పదిలమైన చోటు సుస్థిరపరుచుకున్న మహనాయికుడు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ముఖ్య ఘట్టాలన్ని తీసుకుని రూపోందించిన చిత్రం యాత్ర. దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... మడమతిప్పని నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో అతి కీలకమైన పాదయాత్ర ఘట్టాన్ని మెయిన్ గా తీసుకుని యాత్ర చిత్రాన్ని నిర్మించాము. ఈ చిత్రం లో మళయాల మెగాస్టార్ మమ్ముటి గారు ప్రకజానాయకుడు వై ఎస్ ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారనేది ఇప్పటికే ట్రైలర్స్ చూసినవారందరికి తెలిస్తుంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మించాం. ప్రతి తెలుగు వారు తప్పకుండా చూడాల్సిన చిత్రం. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఏకకాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8 న విడుదల చేస్తున్నాము..తెలుగు పార్ట్ కి సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. మంచి ఎమెషనల్ చిత్రాన్ని నిర్మించినందుకు సెన్సెరు సభ్యులు మా యూనిట్ మెత్తాన్ని అభినందించారు.. వారికి మా ధన్యవాదాలు.. రేపు ప్రేక్షకులు కూడా ఇదే రెస్పాన్స్ ని అందిస్తారని నమ్ముతున్నాము.. అని అన్నారు.