మెగాస్టార్ చిరంజీవి టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వచిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. తాజాగా ఈసినిమాకి సంబందించిన స్క్రిప్ట్ ఓకే అయ్యిందని చిరు స్క్రిప్ట్ విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఈ ఏడాది ఆగస్టు లో విడుదలకానుంది.